పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 25 బోధన్ : ప్రభుత్వ శనగ కొనుగోలు కేంద్రాన్ని మార్క్ ఫెడ్, ఎన్సిసిఎఫ్ నేతృత్వంలో ఖాజాపూర్ గ్రామంలో జిల్లా డిసిసి జనరల్ సెక్రెటరీ ఖజాపూర్ అశోక్ గ్రామ సర్పంచ్ నాగయ్య ఉప సర్పంచ్ శ్రీనివాస్ గ్రామ పెద్దలు మంగళవారం శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.క్వింటాలుకు 5875 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించినట్లు ఖాజాపూర్ అశోక్ గ్రామ సర్పంచ్ నాగయ్య స్పష్టం చేశారు.ఎకరానికి 7 క్వింటాళ్ల 62 కిలోలు శనగ పంటను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా శనగ పంటను విక్రయించాలని అశోక్ సర్పంచ్ నాగయ్య సూచించారు.ఎకరానికి 7 క్వింటాళ్ల 62 కిలోలు పంట కొనుగోలు నిబంధనలు సడలించి రైతు పండించిన మొత్తం పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు నాయకులు మరియు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఖాజాపూర్ గ్రామ పెద్దలు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.