పయనించే సూర్యుడు న్యూస్, మార్చ్ 25, 2026, ఖమాన, వాంకిడి, కొమరం భీమ్, ఝాడే భక్త రాజ్, ప్రతినిధి. నిన్న వెలువడిన గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో వాంకిడి మండలం, ఖమాన గ్రామంలోని ఎంపీపీస్ గొల్లగూడ విద్యార్థులు 11 మందిలో 8 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. ఒకే పాఠశాల నుండి 8 మంది విద్యార్థులు సీట్లు సాధించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులందరు ఆనందం వ్యక్తం చేసారు. పలువురు గ్రామ ప్రజలు కూడా విద్యార్థులను అభినందించారు. ఈ సందర్బంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు అఖిల్, కేశవ్ రావు, సురేఖ, శాంతిలాల్ తమను ప్రోత్సహించి ట్యూషన్ చెప్పడం వల్లనే తాము సీటు సాదించామని విద్యార్థులు ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. సీటు సాధించిన వారి వివరాలు 1)ఝాడే కీర్తన 2)చునర్కర్ జాహ్నవి 3)చునర్కర్ రుచిత్ 4)ఝాడి జ్ఞనేశ్వర్ 5)చునర్కర్ ఉదయ్ కుమార్ 6)మేస్రం అశ్విని 7)పెందూర్ రమ్యశ్రీ 8)చిలివేరి లక్ష్మి నరసింహ