ఘనంగా హనుమాన్ మండప పూజ పాల్గొన్న చైర్మన్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ నవీన్.

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 25 పట్టణంలోని వెంకట్రావ్ పేట్ గుట్ట వద్ద రెబ్బాస్ మహేష్ ఫామ్ హౌస్ లో హనుమాన్ మండప పూజ మంగళవారం ఘనంగా జరిగింది. 1 1వ వార్డు కౌన్సిలర్ రెబ్బాస్ మహేష్ ఆధ్వర్యం లో నిర్వహించిన హనుమాన్ మండప పూజ లో వేదమంత్రోచరణాల మధ్య ఆంజనేయుడికి పంచామృతాలు, జిల్లేడు ఆకులతో అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, కౌన్సిలర్ లు బత్తుల నరేష్, మాసుల ప్రవీణ్, మున్సిపల్ డీఈ నాగేశ్వర్ రావు, మేనేజర్ వెంకట లక్ష్మీ కాంగ్రెస్ నాయకులు కొమిరెడ్డి విజయ్ ఆజాద్, మైలారపు రాంబాబు లు హాజరై హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ దీక్ష పరులకు, భక్తులకు అన్న ప్రసాదం (భీక్ష) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.