చింతకాని మండలంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు మార్చి 25, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలంలో మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో డ్రగ్స్ అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. చింతకాని గాంధీనగర్ కాలనీ, రామకృష్ణాపురం, నాగులవంచ గ్రామాలలో ఈ కార్యక్రమం చేపట్టారు.హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీం ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఈగల్ టీంకు చెందిన డీఎస్పీ సైదులు సారు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైర సీఐ గారు, ఖమ్మం ఎక్సైజ్ ఎస్సై రేష్మ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామ సర్పంచులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.