చిన్న పరిశ్రమల అభివృద్ధికి జెడ్ఈడి అవగాహన సమావేశం..

పయనించే సూర్యుడు మార్చి 25, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామం ఫిషర్ మాన్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో మంగళవారం రోజు నిర్వహించిన ఆర్ ఏ ఎం పి ప్రోగ్రామ్ లో జెడ్ఈడి (జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ ) అవగాహన సమావేశం విజయవంతంగా జరిగింది. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (ఎం ఎస్ ఎం ఈ) ల నాణ్యతను మెరుగుపరుచుకొని, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్ఈడి కన్సల్టెంట్ చిట్టూరి పవన్ వీరేష్, జెడ్ ఈ డి సర్టిఫికేషన్లు, ముఖ్యంగా సిల్వర్ మరియు గోల్డ్ స్థాయిలు, వాటి ద్వారా లభించే ప్రయోజనాల గురించి వివరించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం (డిఐసి) జనరల్ మేనేజర్ గణపతి, టెక్నాలజీ అప్‌గ్రడేషన్, బ్యాంకింగ్ సదుపాయాలు మరియు ఎం ఎస్ ఎం ఈ లకు లభించే వివిధ రకాల ప్రోత్సాహకాలపై సమగ్రంగా వివరించారు. ఐపీఓ రాజేష్ కూడా జెడ్ఈడి ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏ జెడ్ క్వాలిటీ డెవలప్మెంట్ కంపెనీ ఏపీ ఎం ఎస్ ఎం డెవలప్మెంట్ కార్పొరేషన్ ( ఏ పి ఎం ఎస్ ఎం ఈ డి సి) మరియు జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి డి ఐ సి జెడ్ ఎమ్ గణపతి, ఐ ఓ పి రాజేష్, ఏ జెడ్ క్వాలిటీ డెవలప్మెంట్ కంపెనీ సీఈవో కళ్ల జగపతి, జెడ్ఈడి కోఆర్డినేటర్ చిట్టూరి పవన్ వీరేష్, ఆదిత్య, ముడసల సూరిబాబు, మనోహర్, సంతోష్, దివాకర్ మరియు తధితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *