జగ్గయ్యపేట మండలంలోని ₹10,34,567(పది లక్షల, ముప్పై నాలుగు వేల, ఐదు వందల అరవై ఏడు) రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 25 జగ్గయ్యపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 26 మంది, వివిధ అనారోగ్యాల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయించుకుని డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం వారి మెడికల్ బిల్లులను స్థానిక నాయకుల ద్వారా శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దృష్టికి తీసుకురాగా, ఆయన తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించారు. దీనికి స్పందించిన ప్రభుత్వం 26 మంది బాధితులకు గాను మొత్తం ₹10,34,567 (పది లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు) రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరు చేయగా, ఈరోజు శాసనసభ్యులు తమ నివాసంలో బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు చెక్కులను స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కొఠారు సత్యనారాయణ ప్రసాద్, జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, దర్శి విజయ నరసింహారావు, మండల సమైక్య అధ్యక్షురాలు నాయిని రజని, పసుపులేటి శ్రీనివాసరావు, మారేపల్లి శౌరి, షేక్ సుభాని, షేక్ నాగుల్ మీరా, షేక్ బడే మియా, పల్లె బోయిన నాగరాజు, మల్లెబోయిన జ్వాల, కొత్తపల్లి రాజు, గుమ్మ మధు, బాణావతు రవి, మూడు రాంబాబు, గండు కిషోర్, గుడారు నాగర్జున, గుమ్మ వెంకటేష్, గుగులోతు హుస్సేన్, ఆళ్లూరి రమణ, ఇమ్మడి వెంకట్, కరిసే రవి, షేక్ మాబు మియా, మరియు వివిధ గ్రామాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.