జిల్లా అధికారులను సత్కరించిన ఉట్నూర్ ఖయాదత్ యూత్ ఫౌండేషన్ సభ్యులు

పయనించే సూర్యుడు మార్చి 25 ఆదిలాబాద్ జిల్లా న్యూస్ టుడే ఆదిలాబాద్: ఖయాదత్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు గౌరవ సూచకంగా శాలువా మరియు పుష్పగుచ్ఛాన్ని అందజేశారు ఈ సందర్భంగా విద్య అభివృద్ధి యువత పాత్ర సామాజిక ఐక్యత వంటి అంశాలపై స్వల్పంగా చర్చించినట్లు తెలిపారు అదే కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్ మున్సిపల్ కమిషనర్ డిఎల్‌పిఓ ఫణీందర్ ని కూడా శాలువాలతో సత్కరించారు ప్రజాసేవలో వారు చేస్తున్న కృషిని అభినందిస్తూ సమాజాభివృద్ధికి పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు హఫీజ్ సజీద్ సిద్ధిఖీ జాయింట్ సెక్రటరీ షైక్ సోహెల్ పాషా సీనియర్ అడ్వైజర్ ఆరిఫ్ పారేఖ్ క్యాషియర్ అతీక్ సభ్యులు ఫహీమ్ మొయిజ్ తదితరులు పాల్గొన్నారు సమాజంలో సౌహార్దత ఐక్యత సేవా భావం పెంపొందించడమే తమ సంస్థ లక్ష్యమని వారు వెల్లడించారు.