పయనించే సూర్యుడు మార్చి 25 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఎస్సీలు క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్లు వర్తించవని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ఈరోజు సంచలన తీర్పు వెల్లడించింది, షెడ్యూల్డ్ కులాలు (ఎస్ సి) క్రైస్తవ మతంలోకి మారితే, వారికి ఎస్సీలకు ఉండే రాజ్యాంగపరమైన హక్కులు మరియు రిజర్వేషన్లు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది,గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది వివాదానికి కారణం ఏమిటి !? ఒక్కసారి కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే బాపట్ల జిల్లాలోని పిట్లవానిపాలెంలో ఈ వివాదం ప్రారంభమైంది, గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఒక క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని (చర్చి) నిర్వహిస్తున్నారు అయితే,అదే గ్రామానికి చెందిన రామిరెడ్డి మరియు మరికొందరు ఈ చర్చి నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారు,దీనిపై చింతాడ ఆనంద్ తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడినని,తన మత స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తున్నారని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రామిరెడ్డి మరి కొంతమంది వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైంది,దీంతో ఈ కేసును నిందితులు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు,ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత, అతను ఎస్సీగా పొందే హక్కులను కోల్పోతాడని కాబట్టి పోలీసులు అట్రాసిటీ చట్టం కింద తమపై నమోదుచేసిన కేసు చెల్లదని తమ వాదనలు వినిపించారు దళిత క్రైస్తవులకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో నిందితుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు, చింతాడ ఆనంద్ క్రైస్తవుడిగా మారినందున అతనికి ఎస్సీ చట్ట రక్షణ వర్తించదని పేర్కొంటూ కేసును కొట్టేసింది,దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు, ఈ క్రమంలో జస్టిస్ పి.కె. మిశ్రా మరియు జస్టిస్ అంజారియా లతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించి భారతదేశంలో క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత అక్కడ కుల వివక్ష ఉంటుందన్న సరైన ఆధారాలు పిటిషనర్ చూపించలేదు కాబట్టి, కుల వివక్ష ఆధారంగా పనిచేసే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద రక్షణ పొందే అవకాశం పిటిషనరుకు ఉండదని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు మరోసారి స్పష్టం చేసింది క్రిస్టియన్లుగా మారిన ఎస్సీల పరిస్థితి ఏమిటి !? రాజ్యాంగం ప్రకారం, బౌద్ధ మరియు సిక్కు మతాల్లోకి మారిన ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి అయితే, క్రైస్తవ మతంలోకి మారిన వారి విషయంలో రాజ్యాంగంలో ఎటువంటి స్పష్టమైన దిశా,నిర్దేశం లేదు కాబట్టి ఎస్సీలు మతం మారితే ఎస్సీలకు వర్తించే ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెల్లడించడంతో,ప్రస్తుత తీర్పుతో దళిత క్రైస్తవుల హక్కులపై మళ్ళీ దేశంలో చర్చ మొదలైంది,ఈ తీర్పు ప్రభావం దేశంలో దీర్ఘకాలికంగా ప్రభావం చూపడంతో పాటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారబోతోంది, క్రిస్టియన్లుగా మారిన ఎస్సీలు మరోసారి తమ హక్కుల గురించి ఆందోళనకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది,ఇలాంటి క్లిష్టమైన సమస్యలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తుందనే విషయానికి కాలమే సమాధానం చెప్పాలి