
పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 25 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమేష్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆదేశాలమేరకు ఈరోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి ప్లకార్డులతో నిరసన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు 42శాతం బీసీ రిజర్వేషన్ అమలుచేస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ హామీలను అమలు చేయకపోవడం పై తీవ్రంగా విమర్శించారు 42శాతం రిజర్వేషన్ అమలుచేసి 9వ షడ్యూల్ లో పొందుపరచాలని డిమాండ్ చేశారు బీసీ సబ్ ప్లాన్ అమలుపరిచి చట్టబద్దత కల్పించాలని, ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ ఎత్తివేయాలని తెలిపారు. అంతే కాకుండా శాసన మండలి సభ్యుల ఆమోదం లేకుండా దొంగతనంగా ఖర్చు చేసిన కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని పక్కదారిపట్టించిన వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని అన్నారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి ప్రజా ధనాన్ని లూటి చేసేందుకు సహకరించిన అధికారులపై విచారణ చేపట్టి,వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై, కాగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్న తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు బడ్జెట్ లో బీసీలకు కేటాయించిన బడ్జెట్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న మోసం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని తెలిపారు. తెలంగాణ సమాజం అన్నివిషయాలను గమనిస్తుందని, రానున్న రోజుల్లో రావుల అధికారం అంతమైనట్లుగానే, రెడ్డిల అధికారాన్ని అహంకారాన్ని అణిచి బీసీల రాజ్యాధికారం సాధించితీరుతామని ధీమా వ్యక్తం చేసారు. త్వరలోనే అగ్రవర్ణ నాయకులకు రాజకీయ సమాధులు కట్టి, బీసీ రాజ్యాధికారాన్ని సాధించేది కేవలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తీన్మార్ మల్లన్న మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు పుట్ట లావణ్య, జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్,వేముల అశోక్, టీఆర్పీ జిల్లా నాయకులు పడాల శివతేజ, దాస్యపు దీపక్, ఎండి లతీఫ్, సీపతి సాయి కుమార్, భీమిని రమేష్, బూర రవీందర్, దొబ్బల శంకర్, గనవేని నగేష్, బొంగోని విద్యాసాగర్, అడిచెర్ల రూపాదేవి, రమేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.