నాన్ ట్రైబల్స్ విద్యుత్ మీటర్లు తొలగించండి.

* గుర్తించిన అక్రమ కట్టడాలు తక్షణమే కూల్చి వేయండి. * దేవీపట్నం తాసిల్దార్ కు వినతి.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.25.2026 దేవీపట్నం మండల పరిధిలో నాన్ ట్రైబల్స్ కి ఎటువంటి.విద్యుత్ మీటర్లు జారీ చేయవద్దు,ఇప్పటివరకు చట్ట వ్యతిరేకంగా పొందిన నాన్ ట్రైబల్స్ విద్యుత్ మీటర్లు రద్దు.చేయాలని అదేవిధంగా ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నాన్ ట్రైబల్స్ ఎటువంటి అక్రమ కట్టడాలు కట్టకుండా చర్యలు తీసుకోవాలని. తాసిల్దారును కోరడం జరిగింది.గతంలో గుర్తించిన అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించాలని. వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని,లేదంటే ఏజెన్సీ భూములు ఇప్పటికే దోపిడి గురవుతున్నాయని, ఏజెన్సీ చట్టాలన్ని పటిష్టంగా అమలు చేసి,ఏజెన్సీలో భూములు ఆక్రమిస్తున్న. వారిపై క్రిమినల్ కేసులు పెడతానే ఏజెన్సీలో భూ దోపిడీలను అరికట్టటం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.ప్రభుత్వం కూడా ఏజెన్సీ చట్టాలు అమలు విషయంలో నిర్లక్ష్యం వహించకుండా.పటిష్టంగా అమలు చేసే విధంగా పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు కఠిన నిబంధన పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.కుంజా శ్రీను ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *