పయనించే సూర్యుడు మార్చ్ 25. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. మంగళవారం పొడ్చన్ పల్లి గ్రామంలో 48 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పాపన్నపేట లోని ఓ వేడుక మందిరంలో ఆయా గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో మెదక్ నియోజకవర్గాన్ని ముందు ఉంచుతానని అన్నారు. హౌసింగ్ పీడీ మాణిక్యం, తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ విష్ణువర్ధన్, హౌసింగ్ పీడీ మాణిక్యం,డీఈ ప్రసన్న, ఏఈ అరుణ్ ప్రసాద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్,పాపన్నపేట, పొడ్చన్ పల్లి, కుర్తివాడ సర్పంచులు పావని నరేందర్ గౌడ్, ఏసు, చెట్టుకింది శ్రీధర్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, శెట్టి శ్రీకాంత్, ప్రశాంత్ రెడ్డి, గౌస్, ఖలీమ్, నాని, సూఫి, ప్రేమ్ రాథోడ్ , సద్దామ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.