ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవ పురస్కారాలు

పయనించే సూర్యుడు న్యూస్ : మార్చ్ 25 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా వైద్య కళాశాల కాన్ఫరెన్స్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో క్షయవ్యాధి బాధితులకు విశేష సేవలు అందించిన సిబ్బందికి ఉత్తమ సేవ పురస్కారాలు అందజేశారు.అనంతసాగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి హెల్త్ సూపర్వైజర్ కె. రఘురామయ్య, ల్యాబ్ టెక్నీషియన్ మీరాన్ మొహిద్దీన్, హెల్త్ అసిస్టెంట్ టీవీఆర్‌వి ప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ శివకుమారి, ఆశ వర్కర్ మస్తానమ్మలకు ఈ అవార్డులు లభించాయి.జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ సుజాత, అదనపు డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ ఖాదర్ వలీ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు.అలాగే అనంతసాగరం పీహెచ్ సి పరిధిలోని దేవరాయపల్లి బిట్-1 పంచాయతీకి “టీబీ ముక్త్ పంచాయతీ” అవార్డు లభించింది.అనంతసాగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఐదుగురు సిబ్బంది అవార్డులు అందుకోవడం, అలాగే టీబీ రహిత పంచాయతీగా గుర్తింపు పొందడం అభినందనీయమని డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి అవార్డు గ్రహీతలను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *