పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 25 సాలూర : గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు పల్లె దవాఖానాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తుందని మండల ఎంపీడీవో శ్రీనివాస్,గ్రామ సర్పంచ్ సొక్కం లావణ్య రవి,మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ అన్నారు.సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి 12 గ్రామాలకు చెందిన ప్రజలకు వైద్య పరీక్షలు చేయటంతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు.వైద్య పరీక్షలు చేయడానికి పలు విధాలైన డాక్టర్లు వచ్చారు.మొత్తం 450 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు వైద్యులు తెలిపారు.ప్రజలకు వైద్య పరీక్షలు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఎంపీడీవో వెల్లడించారు.ప్రజలకు వైద్య పరీక్షలు మాత్రలను అందజేసిన డాక్టర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు డాక్టర్లు వైద్య సిబ్బంది,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.