ప్రాథమిక పాఠశాలకు ఫ్యాన్ల బహుకరణ

పయనించే సూర్యుడి న్యూస్ మార్చి 25. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో మండవ వెంకయ్య రిటైర్డ్ ఎల్ డి సి జ్ఞాపకార్థం వారి కోడలు మనుమలు మండవ నాగమణి, గోపి, వెంకటేష్ లు పాఠశాలకు దాతృత్వం తో రెండు సీలింగ్ ఫ్యాన్ లను (5000 రూపాయలు విలువచేసే) బహుకరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద పుల్లయ్య, ఉపాధ్యాయులు మొలుగూరి కరుణ గార్లకు అందజేశారు. సి ఆర్ పి నందిగామ రామారావు, గ్రామ పెద్దలు పోలంపల్లి వెంకటేశ్వర్లు, కాసాని శ్రీనివాస్ రావు, పోలంపల్లి నాగేశ్వరరావు ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయురాలు అనంతు.త్రివేణి, ఆయా కనకం స్వాతి, అంగన్వాడీ టీచర్ కమలమ్మ, ఆయాలు గురవమ్మ సాయమ్మ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *