బాల్య వివాహాలను అరికట్టాలని ఆర్డీవో పావని

పయనించే సూర్యుడు మార్చి 25 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) బాల్య వివాహాలను అరికట్టాలని ఆత్మకూరు ఆర్డీవో పావని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చని సీఐ గంగాధర్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఐసిడిఎస్ పట్టణ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, టీనేజ్ బాలికలు గర్భం ధరించడం వల్ల తల్లి-శిశు మరణాలు పెరుగుతున్నాయనీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించిన అంశాలను గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *