భాధిత కుటుంబం నకు ఆర్థిక సహాయం అందించిన లయన్స్ క్లబ్ సభ్యులు..

పయనించే సూర్యుడుమేజర్ న్యూస్ మార్చ్ 25.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంప్రతినిధి జె. నాగరాజ) అన్నమయ్య జిల్లా..పుంగనూరు లో గత నెల 15వ తారీఖున జరిగిన ఘటనలో త్యాగరాజు వీధి కి చెందిన రామచంద్ర తన కుమారుడు ద్విచక్ర వాహనం నుండి వెలువడిన నైట్రోజన్ వాయువు వలన రాత్రి ఇంటిలో నిద్రలోనే తాను తన మనవడు మానవరాండ్రు లు మృతి చెందిన దారుణం చోటుచేసుకోంది. ఈ ఘటనకు స్పందించిన లయన్స్ క్లబ్ సభ్యులు వారి కుటుంబం నకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కెర్ల పల్లి బాల సుబ్రహ్మణ్యం, లయన్ త్రిమూర్తి రెడ్డి, లయన్ రజి అహ్మద్, లయన్ అమరావతి సురేష్, లయన్ సతీష్, జిల్లా నాయికు లు బ్రాహ్మణ(క్షవర వృత్తి )సంఘం కార్యదర్శి ప్రకాష్ ల ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించడం జరిగింది.ఈ సందర్బంగా అధ్యక్షులు కె. బాలసుబ్రమణ్యస్వామి మాట్లాడుతు భాధిత కుటుంబం నకు ప్రభుత్వం తరపున, దాతల సహకారం చాలా అవసరం అని, పేద కుటుంబం పిల్లలు,కుటుంబ పెద్ద ను కోల్పోయిన వారికీ లయన్స్ క్లబ్ తరపున 15,000/-వేల రూపాయలు అందించడం జరిగిందని ఇంకా మరింత మంది దాతలు ముందుకు వచ్చి భాదిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *