మంగళగిరి టిడిపి పార్టీ ఆఫీసులో స్పందన కార్యక్రమం.

పాల్గొన్న రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప.

పయనించే సూర్యుడు మార్చ్ 25 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో ఈరోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు గ్రీవెన్స్ లో మంగళగిరి పార్టీ ఆఫీసులో పాల్గొనాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ని హాజరుకావాలని పిలుపునిచ్చారు లోకేష్ ఆదేశాల మేరకు* ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరిస్తూ అలాగే ప్రజలకు ప్రభుత్వ తరపున ఎల్లప్పుడూ మేము తోడు ఉంటామని భరోసానీచ్చారు అలాగే చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలను పరిష్కరించారు ఇంకా కొన్ని సమస్యలు వారం లోపల ప్రజలకు న్యాయపరంగా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపినారు సమస్య లేని ప్రజలు రాష్ట్రంలో ఉండాలని ప్రతి సోమవారం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *