మండల పరిషత్ అభివృద్ధి అధికారి జీ. శ్రీను (ఎంపీడీవో) పర్యటించి ప్రభుత్వ ఆసుపత్రి మరియు అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 25 పెనుగంచిప్రోలు గ్రామంలో ఈ రోజు మండల పరిషత్ అభివృద్ధి అధికారి జీ. శ్రీను (ఎంపీడీవో) పర్యటించి ప్రభుత్వ ఆసుపత్రి మరియు అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. మొదటిగా పెనుగంచిప్రోలు ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీడీవో జి శ్రీను , వైద్య సేవల నిర్వహణ, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత, శుభ్రత తదితర అంశాలను సమీక్షించారు. రోగులకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకొని, అవసరమైన సౌకర్యాలు మెరుగుపర్చాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి, చిన్నారులకు అందుతున్న పోషకాహారం, ప్రీ-స్కూల్ కార్యకలాపాలు, హాజరు నమోదు వంటి అంశాలను తనిఖీ చేశారు. పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో. జి శ్రీను .మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా అధికారులు కృషి చేయాలని, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *