పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 25 రిపోర్టర్ అభి మంత్రాలయం టిడిపి ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి, యువ నాయకుడు ఎన్. రాకేష్ రెడ్డి పలు గ్రామాల్లో నిర్వహించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తోవి గ్రామంలో నిర్వహించిన సింతోవయ్య జాతరలో పాల్గొని భక్తులతో మమేకమయ్యారు. అనంతరం ఆగసలాదిన్నె గ్రామంలో జరిగిన “రైతన్న మీకోసం” వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. లింగాలదిన్నె గ్రామంలో ‘వన్ విజిట్’ కార్యక్రమం నిర్వహించి స్థానిక సమస్యలను పరిశీలించారు. కౌతాళం టౌన్లో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛ రథ ప్రారంభంలో పాల్గొని పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో కూటమి అధ్యక్షులు, మండల అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.