పయనించే సూర్యుడు మార్చి 25 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి: ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నాగర్ కర్నూల్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షులు మంగి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు భాను ప్రకాష్, జనరల్ సెక్రటరీ ఆనంద్ సింగ్, కార్యదర్శులు బోనాసిరాజు, సుధాకర్ ఆచారి పాల్గొన్నారు. బిజినపల్లి మండలానికి చెందిన ఎం. శివమ్మ (తండ్రి స్వామి, ఎస్సీ మాదిగ) 01-01-2012న జన్మించినప్పటి నుండి మానసిక ఎదుగుదల లేకపోవడంతో, ఆమెకు మెడికల్ హెల్త్ (వికలాంగత) సర్టిఫికేట్ జారీ చేయాలని కోరారు. గత ఆరు సంవత్సరాలుగా సంబంధిత అధికారులు సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఈ విషయాన్ని మెడికల్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అమ్మాయి భవిష్యత్తు దృష్ట్యా త్వరితగతిన హెల్త్ సర్టిఫికేట్ జారీ చేసి, ప్రభుత్వ పథకాల ద్వారా లభించే సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.