పయనించే సూర్యుడు మార్చి 25 (జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న)హిందూ సేవకుల దేవాలయ శుద్ధి, సంప్రోక్షణ దేవాలయాన్ని మూసివేసే కుట్రలో భాగంగా దేవాలయాన్ని ముందు అడ్డుగా భారీ ఫ్లెక్సీలు కట్టడం, చెత్త కుప్పలు, ఎంగిలి టీ కప్స్, ప్లేట్లు, కవర్లు, వ్యర్థాలతో దేవాలయ ప్రాంగణంలో పవిత్ర భంగం చేస్తున్నారని డాక్టర్ మోహన్ కృష్ణ ఆరోపించారు మురికికాలువల పైకప్పు, ఫ్లెక్సీల నియంత్రణ, నిరంతర పారిశుధ్యం, దేవాలయ శుభ్రత, పవిత్రత కోసం మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో ఉప్పలమ్మ దేవాలయం తన ఉనికిని, వ్యర్థాలతో నిండిపోయి దేవాలయం తన రూపాన్ని, పవిత్రతను కోల్పోతుందని ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త డాక్టర్. మోహనకృష్ణ భార్గవ ఆవేదన వ్యక్తం చేసారు. మున్సిపాలిటీ యంత్రాంగ నిర్లక్ష్యం పట్ల, స్థానికుల వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. జనగామ బస్టాండ్ కూడలి వద్ద గల ఉప్పలమ్మ దేవాలయాన్ని చెత్తకుప్పగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అర్చకులు పిట్టల రాములు (శివయ్యగారు) వాపోయారు. వారి సమాచారం మేరకు దేవాలయ శుద్ధి కొరకు హిందూ యువత నడుం బిగించారు. డాక్టర్ మోహనకృష్ణ భార్గవ, చిలువేరు హర్షవర్ధన్, డా. అంబటి బాలరాజు, ఉల్లెంగుల రాజు, పిట్టల రాములు, తెలకలపల్లి సాయికుమార్ తదితరులు దేవాలయాన్ని చేరుకుని శుద్ధి సంప్రోక్షణ చేపట్టారు. కాగా పలువురు భక్తులు స్వచ్ఛందంగా శుద్ధికార్యంలో చేయి కలిపారు. ఈ సందర్భంగా పిట్టల రాములు మాట్లాడుతూ దేవాలయం ఇరుపక్కల హోటల్ యాజమాన్యాలు వ్యర్థాలను దేవాలయం దగ్గర పారవేస్తున్నారని, టీ కప్పలు కవర్లు ప్లేట్లు వంటి చెత్తతో మురికి కాలువ నిండిపోయి బురద మెట్లపైకి వస్తుందని, మోరినీటిని తొక్కుతూ దేవాలయానికి వెల్లవలసివస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఆలయాన్ని మూసివేస్తూ భారీ ఫ్లేక్సీలు కడుతున్నారని, ఆలయం గేటువద్దే బైక్ ల పార్కింగ్ మరింత ఇబ్బందికరంగా మారిందన్నారు. మోహనకృష్ణ భార్గవ మాట్లాడుతూ కుట్రపూరితంగా దేవాలయాన్ని కనుమరుగు చేసే విధంగా ఇవన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేవాలయమే కనబడకుండా ఫ్లెక్సీలు కట్టడం, అడ్డంగా కర్రలు పెట్టడం, గేటు ముందు బైకులు పార్కింగ్ చేయడం అందుకు నిదర్శనమన్నారు. మున్సిపాలిటీ యంత్రాంగం కనీసం వ్యర్థాలను తీసే ప్రయత్నం చేయట్లేదని, మురికికాలువలు చెత్తతో నిండిపోతున్న పట్టించుకునే నాథుడే లేరని ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానికులు సైతం దేవాలయాన్ని కాపాడుకోవాలి, మన కనీస ధర్మంగా శుభ్రత పాటించాలనే భక్తి, ధార్మిక ఆలోచన లేకుండా దేవాలయం ముందే మిగులు వ్యర్థాలు పడేయడం, ఫ్లెక్సీలు కర్రలు ఆలయ ప్రాంగణంలోనే పారవేయడం, ఎంగిలి నీటిని, నూనెలు పారబోయడం, ఎంగిలి టీ కప్పులు ప్లేట్లు కవర్లు విసిరేయడం వంటి అసహ్యకరమైన పనులకు పాల్పడుతున్నారని అన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి మురికికాలువపై పైకప్పు ఏర్పాటు చేయాలని, వ్యర్థాలను ప్రతీరోజు శుభ్రం చేయాలని, ఫ్లెక్సీలు ఎవరు కట్టకుండా చర్యలు తీసుకోవాలని, నోపార్కింగ్ గేట్లు ఏర్పాటు చేయాలని కోరారు. దేవాలయాన్ని , పవిత్రతను కాపాడుకోవడం, అభివృద్ధి చేసుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. దేవాలయ నిర్వాహకులు ది జనగామ లారీ అసోసియేషన్ వారు వెంటనే స్పందించి హోటల్ యాజమాన్యాలను హెచ్చరించారు, అంతేకాకుండా దేవాలయంలో ఇటువంటి సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మున్సిపాలిటీ నిర్లక్య వైఖరిపై ప్రజలు, హిందూ సంఘాలు, దేవాలయ నిర్వహకులు, లారీ అసోసియేషన్ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.