
పయనించే సూర్యుడు మార్చి 25, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి డీకే అరుణ మంజూరు చేసిన ప్రత్యేక నిధులతో గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు మంగళవారం నాటికి మూడవ రోజుకు చేరుకున్నాయి గ్రామ సర్పంచ్ పర్యవేక్షణలో స్థానిక హనుమాన్ దేవాలయం సమీపంలో ఈ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగ దేవాలయా కమిటీ అద్యక్షులు దూళ్ల పుల్లయ్య మాట్లాడుతూ గ్రామస్తుల సౌకర్యార్థం, ముఖ్యంగా దేవాలయానికి వచ్చే భక్తుల విషయం లో అందరూ బాగుండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టిన గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు హనుమాన్ దేవాలయ కమిటీ అధ్యక్షులు దూల్ల పుల్లయ్య , వార్డు సభ్యులు , నరిగె నర్సింలు, నరిగె శివలింగం, గ్రామస్తులు పాల్గొన్నారు.