పయనించే సూర్యుడు మార్చ్ 25 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ అష్టమి తేదీ 26.03.2026 గురువారం రోజున పాపన్నపేట గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మహా సుదర్శన యాగం మరియు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించబడును ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్య పూజ 8.00 గంటలకు గణపతి పూజ పుణ్యవాచనం నవగ్రహ, వాస్తు ఆరాధన పూర్వక మహా సుదర్శనయాగం మరియు శ్రీ లక్మి పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడును. చైత్ర శుద్ధ నవమి తేదీ 27.03.2026 శుక్రవారం రోజున శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతా రామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడును. రాత్రి 7.00 గంటలకు శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి పల్లకి సేవ జరుగుతుంది. ఈ మహత్తర ఘట్టానికి సమస్త భక్త మహాశయులు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి స్వామి వారి సేవలో పాల్గొని కృప కటాక్షాలు పొందాలని కొరుకుంటన్నాము. తేదీ 26.03.2026 మరియు 27.03.2026 రోజున అన్న ప్రసాదం కార్యక్రమం కలదు గ్రామ పురోహితులు బ్ర॥ శ్రీ చెరువుపల్లి విశ్వనాథ శర్మ పాపన్నపేట.