రైతన్న మీకోసం వారోత్సవాలు 5 వ రోజు కార్యక్రమం.

హాజరైన టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు

పయనించే సూర్యుడు మార్చి 25 కర్నూల్ జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ రైతన్న మీకోసం వారోత్సవాలు 5వ రోజు కార్యక్రమాన్ని ఆదోని టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగిందిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైతన్న మీకోసం వారోత్సవాలు” కార్యక్రమంలో భాగంగా 5వ రోజు నారాయణపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతుల ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ రైతుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. రైతు అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి రైతుకు సంక్షేమ పథకాల ప్రయోజనం చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.అలాగే రైతులకు కరపత్రాలను పంపిణీ చేసి, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులతో సన్నిహితంగా మమేకమవుతూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారుఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మార్కెట్ యార్డ్ చైర్మన్ శారదా భాయ్, రంగస్వామి నాయుడు, శ్రీకాంత్ రెడ్డి, ఎల్.ఎల్.సి చైర్మన్ రామస్వామి, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, రంగన్న, జిందే శంకర్, ఎక్స్ కౌన్సిలర్ అంజి, అయ్యన్న, గిడ్డయ్య, కిష్టప్ప, శ్రీరాములు, వెంకటేష్, చాగి రాము, చాగి గుల, చక్రవర్తిఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ నాయకులు ఎక్స్ ఎంపీటీసీ చంద్రశేఖర్, ఎంపీటీసీ కర్రెప్ప, సిద్ధిలింగ, గణేష్, చంద్రబాబు, కోసిగి మల్లికార్జున,మల్లేష్, గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.