పయనించే సూర్యుడు, మార్చి 25 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి గౌ.శ్రీ ఎ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యఅతిధిగా హాజరై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ కులు పట్వారీ శశిధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్త లు,మహిళా నాయకురాళ్లతో కలిసి సీఎం చిత్రప టానికి పాలాభిషేకం కార్య క్రమం నిర్వహించడం జరిగింది.ఈ సంద ర్బంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియ చేసారు. మొదటి విడతలో భాగంగా ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్ల నగదు జమ కానుందని అన్నారు. మూడు విడతల్లో రైతు భరోసా నిధులు విడుదల చేసేం దుకు ప్రభుత్వం నిర్ణయిం చ్చిందని తెలియచేసారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.