రైతు భరోసా నిధుల విడుదల పట్ల హర్షం.

వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి.

పయనించే సూర్యుడు మార్చ్ 25 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయడంపై వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరేలా రూ.3,600 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయని పేర్కొన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని అన్నారు. రైతును ఆర్థికంగా బలపర్చేందుకు ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రైతుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా &బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *