విలాసాగర్ లో ఉపాధి హామీ పనులు ప్రారంభించిన

సర్పంచ్ ఏనుగుల కనకయ్య.

పయనించే సూర్యుడు మార్చి 25 కరీంనగర్ న్యూస్: విలాసాగర్ గ్రామం చెరువు లో ఉపాధి హామీ పనులు సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉప సర్పంచ్ పోత్తూరి శైలజ, మరియు వార్డ్ సభ్యులు జోగు శంకర్, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ చేతుల మీదుగా నూతన ఉపాధి హామీ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ కనకయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ లో పని చేసే ప్రతి ఒక్కరు రాబోయే ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని పొద్దున పనులు ప్రారంభించి ఎండ తీవ్రత కాకముందు ఇంట్లోకి చేరాలని ఎండ తీవ్రతకు తగినంత తాగు నీరు ప్రతి ఒక్కరు తీసుకోవాలని ,సలహాలు సూచనలు ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో విలాసాగర్ ఫీల్డ్ అసిస్టెంట్ గంగాధర కనకరాజు,మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *