వైద్య కళాశాల విద్యార్థులచే క్షయ వ్యాధి అవగాహన ర్యాలీ.

వైద్యాధికారి డాక్టర్ పి సృజన. డాక్టర్ నరేష్ .

పయనించే సూర్యుడు మార్చి 25 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నాగర్ కర్నూల్ వైద్య కళాశాల 2024 విద్యార్థులచే క్షయ వ్యాధి అవగాహన ర్యాలీని వైద్యాధికారి డాక్టర్ పి.సృజన ప్రారంభించారు. సమాజంలో క్షయ వ్యాధిని త్వరగా గుర్తిస్తే, చికిత్సతో పాటు నిర్మూలన సాధ్యమవుతుంది అని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ప్రధాన రోడ్డు వెంబడి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీవీ ముక్త్ భారత్ వారి ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు కిట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ నరేష్, మెడికోసోషల్ వర్కర్ డి.బాలమ్మ,హెల్త్ సూపర్వైజర్ అశోక్ కుమార్,చంద్రశేఖర్, క్షయ వ్యాధి సూపర్వైజర్ శ్రీనివాసులు,ఆరిఫ్,శ్రావణ్, మహిళా ఆరోగ్య కార్యకర్తలు కే.మంగ,శ్వేత,ఆశా కార్యకర్తలు,కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.