వ్యాపారస్తుల వృత్తి పన్నుపై అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి మార్చి 25 యాడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి శాలలో జీఎస్టీ రవి ఆధ్వర్యంలో సేల్స్ టాక్స్ వృత్తి పన్ను శాఖ అధికారులచే అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున వ్యాపారస్తులందరూ పాల్గొన్నారు 40 లక్షల రూపాయల సంవత్సరం టన్నోవర్ ఉంటే కచ్చితంగా జిఎస్టి తీసుకోవాలని అంతకన్నా తక్కువ ఉంటే కాంపొజిషన్ తీసుకుని గవర్నమెంట్ కు మూడు నెలలకు ఒకసారి టాక్స్ లు కట్టాలని టాక్స్ కట్టకపోతే మీ దగ్గర ఉన్న డబ్బంతా బ్లాక్ మనీ అవుతుందని బ్లాక్ మనీ తో మీ డబ్బులు లకు మీ హక్కు ఉండదని మీరు ఏమి చేయలేరని అదే గవర్నమెంట్ టాక్స్ కట్టి ఆ డబ్బులను వైట్ మనీ గా చేసుకుంటే గవర్నమెంట్ పరంగా అది మీ డబ్బు అవుతుందని ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఏవైనా రాజమార్గంలో వ్యాపారాలు కానీ బ్యాంకు డిపాజిట్లు గాని చేసుకోవచ్చని తెలిపినారు ఇంకా మీకు ఏవైనా సమస్యలు ఉంటే మాకు చెప్పాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి సి టి ఓ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి డి సి టి ఓ శ్రీనివాసులు వెంకటేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి యాడికి మండల వ్యాపారస్తులు కిరాణా వ్యాపారస్తులు క్లాత్ బిజినెస్ వారు పట్టు చీరల వ్యాపారస్తులు పాల్గొని సమస్యలు తెలియజేశారు అధికారులు వారి సమస్యలకు చట్టపరంగా పరిష్కరిస్తామని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *