సమస్యల సాధనకై రణభేరి యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దీక్ష లు

ఫోటో శిబిరంలో మాట్లాడిన యుటిఎఫ్ సీనియర్ నాయకులు.

పయనించే సూర్యుడు 25 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఫోటో శిబిరంలో మాట్లాడిన యుటిఎఫ్ సీనియర్ నాయకులు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించడం సమంజసం కాదని ఉపాధ్యాయులు రణభేరి మోగించారు. అధికారం చేపట్టే రెండేళ్లు కావస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు నిర్లక్ష్యం చేస్తుందని ఇలా అయితే సమరానికి సిద్ధమని యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు దీక్షలకు పూనుకున్నారు. మంగళవారం ఆదోని పట్టణంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్షను యుటిఎఫ్ సీనియర్ నాయకులు శివ మూర్తి,జగదీశ్వరయ్య, కృష్ణమూర్తి గౌడ్, హెచ్ఎం ఫయాజ్ యూటీఎఫ్ పట్టణ గౌరవ అధ్యక్షుడు సునీల్ రాజ్ కుమార్ ప్రారంభించారు దీక్షలో గాది లింగప్ప,లింగన్న ,సుధాకర్ నారాయణ ,మల్లికార్జున ,కృష్ణుడు నాగేషు ,మల్లికార్జున,రంగన్న జగన్మోహన్ సి బాబుమహేశ్వర్ రెడ్డి పి రంగన్న జనార్దన్ సక్కరి భాస్కర్ లక్ష్మన్న కూర్చున్నారు ఇది దీక్ష శిబిరానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ ఎస్ఎఫ్ఐ సీనియర్ నాయకులు లక్ష్మణ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు శశిధర్ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పిఆర్సి కమిషన్కు చైర్మన్ ను వెంటనే నియమించాలని 29% ఐ ఆర్ ప్రకటించాలని ,పెండింగ్ డిఏలు విడుదల చేయాలని ఉద్యోగుల ,పెన్షనర్ల బకాయిలను చెల్లింపుకు రూట్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు, సిపిఎస్ రద్దు చేయాలని మెమో 57 ప్రకారం 2004 ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి పాత పెన్షన్ అమలు చేయాలని హెల్త్ కార్డుల మెడికల్ బిల్లు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు కోవిడ్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 953 మంది ఉపాధ్యాయులు చనిపోయారని వారి కుటుంబ సబ్యులకు ఇంకా ఉద్యోగాలు కల్పించలేదన్నారు వెంటనే కారుణ్య నియామకాలు కల్పించి కుటుంబాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమిప్రభుత్వం పరిష్కరించని పక్షంలో దశలవారీగా పోరాటాలు నిర్వహించి రాష్ట్ర కేంద్రంలో కూడా మహా ధర్నా చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *