పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 26 బోధన్:బంజారా సంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో బోధన్ మండలంలోని బంజారా నాయకులను బోధన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.ఉదయం 5 గంటలకు కొర్ర బంతిలాల్ నాయక్, నూనావత్ విశ్వనాథ్, జాదవ్ ప్రవీణ్ నాయక్, దేవసొత్ సంతోష్ నాయక్ తదితరులను బోధన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టులను బంజారా సంఘాలు ఖండించాయి. న్యాయం చేయకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు.