పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 26 రిపోర్టర్ అభి పెద్దకడబూరులోని ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆర్.ఎఫ్. రాఘవేంద్ర తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పించబడతాయి. పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుం ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200 కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150గా నిర్ణయించారు. ఆసక్తి గల విద్యార్థులు apms.apcfss.in, cse.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా లేదా సమీప నెట్ సెంటర్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 9705555735 నంబర్‌ను సంప్రదించాలన్నారు.