ఆర్డీవోను సన్మానించిన జనసేన నాయకులు.

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ) మార్చి 26 2026 మెట్ పల్లి పట్టణం లో నూతన ఆర్డీవో జి. నరసింహారావు ను సన్మానించారు. జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. తదుపరి ప్రజా సేవలో ప్రజల సమస్యలపై విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ జనసేన నాయకుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రమాదేవి, ఎనుగందుల అజయ్ , అబ్బూరి ఆనంద్, కడారి శ్రీకాంత్,కోటగిరి అరుణ్ , ఇరుగదిండ్ల వెంకటేష్, మహేందర్ కడారి, రమాకాంత్ కడారి, చంద్రశేఖర్, కుంట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.