ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.

* ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం . * అర్హులైన పేదలందరికీ సొంతింటి కల నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. * త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు . * ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.

పయనించే సూర్యుడి న్యూస్ చండూరు మార్చి 26. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ గృహ నిర్మాణంలో భాగంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చొప్పరివారి గూడెంలో నిర్మాణం పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం చేశారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి నిర్మాణం కోసం కళ్ళు గన్న కుటుంబాలు నేడు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలతో వారి సొంతింటి కలలను నెరవేర్చుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూలిపోయిన ఇళ్లను చూసి చలించిపోయి, అధికారంలోకి రాగానే ఇళ్లను నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయించడం ప్రభుత్వనికి  ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.  సొంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. నిర్మాణంలో ఉన్న మరికొన్ని ఇందిరమ్మ ఇళ్లను  త్వరలో పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు చొప్పరి రాజు యాదవ్ చొప్పరి వారి గూడెం గ్రామ సర్పంచ్ జాల వెంకన్న యాదవ్ మాజీ సర్పంచ్ చొప్పరి అనురాధ వెంకన్న యాదవ్ గ్రామ ఉపసర్పంచ్ చొప్పరి మారుతి భాస్కర్ యాదవ్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు గుండాల మహేష్ యాదవ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు చొప్పరి శేఖర్ యాదవ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు చొప్పరిశంకర్ యాదవ్ చొప్పరి స్వామి యాదవ్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *