ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాన్ని ప్రారంభించిన ఎంపీడీవో యాదగిరి .

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 26 తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ గృహ నిర్మాణంలో భాగంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఉడుతలపల్లి గ్రామము లో కుక్కల బుజ్జమ్మ, కుక్కల ఓంకారము కు చెందిన ఇందిరమ్మ ఇళ్ల ను చండూరు ఎంపిడిఓ యాదగిరి ఉడుతలపల్లి సర్పంచ్ కావలి శివాని సురేష్ తో కలిసి ప్రారంభినారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళు పెదోళ్ళ ఒక వరం అని అన్నారు. మిగిలిన లబ్ధిదారులు కూడా త్వరగా ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరారు.ఇట్టి కార్యక్రమం లో ఉప సర్పంచ్ సిలుముల రజిత రమేష్,పంచాయతీ కార్యదర్శి శంకర్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు బుషిపాక శంకర్,వార్డు సభ్యులు కావలి అశోక్, మెరుగు అమృత యాదయ్య, కారింగు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *