ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చొరవతో శ్రీకాంత్‌కు రూ.1 లక్ష ఎల్.ఓ.సి మంజూరు

ఎల్ వో సి లెటర్ ను అందజేస్తున్న మాజీ ఉపసర్పంచ్ బాలపీరు

పయనించే సూర్యుడు మార్చి 26 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే.శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుందేళ్ల శ్రీకాంత్‌కు వైద్య చికిత్స కోసం రూ.1,00,000 విలువైన ఎల్.ఓ.సి ను మంజూరు చేయించారు. ప్రస్తుతం శ్రీకాంత్ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 5వ వార్డు మెంబర్ నండిపేట మల్లయ్య, మాజీ డిప్యూటీ సర్పంచ్ బాలపేరు కలిసి ఆసుపత్రికి వెళ్లి శ్రీకాంత్‌కు ఎల్.ఓ.సి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి శ్రీకాంత్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *