ఎలక్షన్లో ఇచ్చిన హామీ నెరవేర్చిన సర్పంచ్ ఉపసర్పంచ్ – యువత కోసం గ్రౌండ్ అభివృద్ధ

పయనించే సూర్యుడు, మార్చి 26 బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, ఇరవెండి గ్రామంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సర్పంచ్ గుండి బాబురావు, ఉప సర్పంచ్ సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు, యువత కోసం క్రికెట్ గ్రౌండ్‌ను అభివృద్ధి చేయించారు. గ్రౌండ్ క్లీనింగ్ చేపట్టి, ఆధునిక వైబ్రేటర్ యంత్రంతో సమతలీకరణ పనులు నిర్వహించారు. గ్రామ చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి ఆధునిక పద్ధతులతో గ్రౌండ్‌ను సరిచేయడం విశేషంగా నిలిచింది. యువతకు క్రీడలపై ప్రోత్సాహం కల్పించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి ట్రస్ట్ డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీ కృష్ణ, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *