ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి.

* అక్రమ కట్టడాలు తక్షణమే తొలగించాలి. * నాన్ ట్రైబల్స్ కు జారీ చేసిన విద్యుత్ మీటర్లు తక్షణమే తొలగించాలని.ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 26.2026 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం చింతూరు ఐటిడిఏ పరిధిలోని చింతూరు, వి.ఆర్.పురం,కూనవరం మరియు ఎటపాక మండలాల్లో గిరిజన చట్టాల ఉల్లంఘనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని.ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ఆందోళన వ్యక్తం చేశారు.బుధవారం చింతూరులో జరిగిన. ప్రజా గ్రీవెన్స్‌లో ఐటీడీఏ ఏవోకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో 1/70 చట్టం అమలులో ఉన్నప్పటికీ,గిరిజనేతరులు అక్రమంగా భూములను ఆక్రమించి.వాణిజ్య సముదాయాలు,జామాయిల్ తోటలు సాగు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు విద్యుత్ మీటర్ల జారీని వెంటనే నిలిపివేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాత కనెక్షన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రాల్లో ప్రభుత్వ అవసరాలకు కూడా భూమి లేకుండా అక్రమ కట్టడాలు వెలిశాయని, అధికారులు వెంటనే ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఆక్రమణలను తొలగించాలని కోరారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆదివాసీల రాజ్యాంగ హక్కులను కాపాడాలని,నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కుంజా శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రస్తుతం నాలుగు మండల పరిధిలో ఉన్న పలు సచివలయంల్లో సిబ్బంది.కొరత ఉందని చాలా మంది సిబ్బందిని పోలవరం ఆర్ అండ్ ఆర్ సెంటర్లో డిప్యుటేషన్ వేశారు.మరి కొంతమంది ఇంచార్జీ గా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది కొరత వల్ల సామాన్య ప్రజలకు సచివలయ సేవలు సకాలంలో అందటం లేదని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. సచివాలయంలో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఆయన. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ చింతూరు డివిజన్ అధ్యక్షులు కూర చిట్టి బాబు, పరదా శివరామకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కుంజా శ్రీను ఆదివాసి సంక్షేమ పరిషత్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *