
పయనించే సూర్యుడు మార్చి 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు పట్టణంలోని ఏసి ఎస్ ఆర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీ కే. వేణుగోపాల్ సూచనలతో సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో విస్తృత తనిఖీలు.ఈ కార్యక్రమంలో ఇద్దరు సీఐలు 7 మంది ఎస్ఐలు 50 మంది పోలీసులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిని పరిశీలించి ఇక్కడ నివసించి వారి వివరాలు తెలుసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు సీఐ గంగాధర్ పలు సూచనలు చేశారు. గంజాయి వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షణ చేయాలంటూ స్థానికులకు సూచించారు. ఈ తనిఖీ లో సరైన పత్రాలు లేని 31 స్కూటర్లను నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. తెలిపారు నియోజకవర్గం పలు మండలాల. ఎస్సైలు. సీఐలు. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు