ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలలో 72 మంది విద్యార్థుల ఎంపిక

మండల విద్యాధికారి నరసింహ

పయనించే సూర్యుడు మార్చ్ 26 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) 5వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో గుండ్లపల్లి(డిండి) మండలంలోని మండల పరిషత్ కు చెందిన 17 పాఠశాలల నుండి 72 మంది విద్యార్థులు ఎంపికైనందున విద్యార్థులకు మరియు వారిని పరీక్షలకు సన్నద్ధం చేసిన ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలియజేసిన ఎంఈఓ నరసింహ.ఎంపికైన విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎంపికైన విద్యార్థులు ఏప్రిల్ 15 తేదీలోపు ఆయా పాఠశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు.