పయనించే సూర్యుడు మార్చి 26, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఈ కార్యక్రమానికి ఫ్యాక్టరీల డెప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ జి.వి.ఎస్. నారాయణ మరియు ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్ కె. రాంబాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా మొక్కలు నాటే కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి, అనంతరం భద్రతా పరికరాల ప్రదర్శనను సందర్శించారు. సేఫ్టీ మేనేజర్ కే సాయికృష్ణ భద్రతా నివేదికను సమర్పించిన తర్వాత.. డిసిఐఎఫ్ నారాయణ , ఐఓఎఫ్ రాంబాబు, జిఎం విజయ్ కుమార్, డీజీఎం సాయిరాం, హెడ్ హెచ్ ఆర్ పి ఎస్ ఎన్ మూర్తి మరియు మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ మురళి ఉద్యోగులను ఉద్దేశించి సేఫ్టీ ప్రాముఖ్యత గురించి వివరించారు.
