కాలుష్య పోరాట జేఏసీ కమిటీకి మద్దతుగా శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 26 జగ్గయ్యపేట పట్టణo పరిధిలో ఉన్న ఆటోనగర్ లోని కెమికల్ కర్మాగారాలను తరలించాలని.. జగ్గయ్యపేట ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడాలని జేఏసీ పిలుపు మేరకు ప్రజల స్వచ్ఛంద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా.. శాంతినగర్ లో ఉన్న కాకతీయ బస్ షెల్టర్ వద్ద పొల్యూషన్ బాధితుల జేఏసీ సభ్యులను కలిసి సంతకాలు చేసి వారికి సంఘీభావాన్ని తెలియజేసిన జగ్గయ్యపేట శ్రీకృష్ణదేవరాయ సేవాసమితి కమిటీ సభ్యులు.. ఈ కార్యక్రమంలో సమితి గౌరవ అధ్యక్షులు గోగుశెట్టి వెంకట మహేష్ , మరొక గౌరవ అధ్యక్షులు వట్టెం మనోహర్ , సేవా సమితి అధ్యక్షులు కామి సేట్టి అమర్నాథ్ , ఉపాధ్యక్షులు దివ్వెల రామారావు మరియు సనక మురళి వెంకట మోహన్ రావు , పాల్గొన్నారు ఈ సందర్భంగా వట్టెం మనోహర్ మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణ ప్రజలకి రాబోయే రోజుల్లో ఈ కాలుష్య కర్మాగారాల వలన తీవ్రమైన ప్రాణనాష్టం జరిగే అవకాశం ఉందని భూగర్భ జలాలు కల్పితం అయిపోయి వాడుకోవడానికి నీరు తాగడానికి నీరు కలుషితమై అనారోగ్య సమస్యలతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం అధికారులు వెంటనే స్పందించకపోతే ఇప్పుడు ఉన్న జేఏసీ సభ్యులే కాక జగ్గయ్యపేట పట్టణ సామాన్య ప్రజలు పిల్లలు పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొని రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయవలసి వస్తుంది వెంటనే జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ యంత్రాంగం దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి పట్టణానికి ఆనుకొని ఉన్న జనావాసాలకు దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క కాలుష్య కర్మాగారాలను పూర్తిగా తరలించాలని పేట ప్రజలను వారి ప్రాణాలను కాపాడాలని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అంతేకాకుండా జేఏసీ పిలుపుమేరకు వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో నిర్వహణ జేఏసీ వారు.
ధరణికోట వెంకటరమణ , డాక్టర్ బొజ్జ రాజేష్ ,గద్దె నాని , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు