పయనించే సూర్యుడు మార్చి 26, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలం కుచర్కల్ గ్రామ పంచాయతీలో వింత పరిస్థితి నెలకొంది.వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం కుచర్కల్ గ్రామ సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం తమ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న రవికుమార్ అదే గ్రామానికి చెందిన వారు కావడంతో, విధుల్లో కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారనీ, గ్రామ అభివృద్ధి కుంటుపడుతోందని , ఇప్పటికే మూడు సార్లు కార్యదర్శులు మారడం , స్థానిక రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల గ్రామంలో మరింత వేగవంతమయ్యే అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యము అవుతాయని గ్రామస్తులు , గ్రామ సర్పంచ్ అధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కార్యదర్శి స్థానిక నివాసి కావడంతో పక్షపాత ధోరణి కన్పించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.అభివృద్ధి సాఫీగా సాగాలన్నా, పాలనలో నిష్పాక్షికత ఉండాలన్నా ప్రస్తుతం ఉన్న కార్యదర్శిని వేరే ప్రాంతానికి బదిలీ చేసి, బయటి ప్రాంతానికి చెందిన కార్యదర్శిని నియమించాలని సర్పంచ్, గ్రామ ప్రతినిధులు, పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను కోరారు.. ఈ కార్యక్రమంలో కుచర్కల్ గ్రామ సర్పంచ్, పలువురు గ్రామస్తులు, పెద్దలు పాల్గొన్నారు