పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 26,తల్లాడ రిపోర్టర్ తల్లాడ స్థానిక తహసీల్దార్ కు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధాన్యం మొక్కజొన్న కేంద్రాలను వెంటనే తెరవాలని ఇప్పటికే పలుచోట్ల ధాన్యం చేతికోచ్చి తమ అవసరాల కోసం రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని అలాగే మొక్కజొన్న వేలాది ఎకరాల్లో సాగు చేశారని తయారై రైతులు ఇల్లముందు ఎండపోసుకుని ఉన్నాయి వాతావరణ పరిస్థితులు వలన కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారో తెలియక దళారులకు క్వింటా 1500 కు మాత్రమే అనుకుంటున్నారు వస్తుందని మార్క్ఫెడ్ ద్వారా 2300 ఉన్న అందని ద్రాక్షలా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదని వెంటనే ధాన్యం మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఎం తల్లాడ మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి పార్టీ మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర రావు నల్లమోతు మోహన్ రావు కోటిరెడ్డి నర్సిరెడ్డి మురళి రామారావు కోమటి కన్నయ్య నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు