గండి పోచమ్మ అమ్మవారికి రూ.1 లక్ష విరాళం అందజేసిన ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 26.2026 మాతృశ్రీ గండి పోశమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని,ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ప్రకటించిన. రూ.లక్ష విరాళాన్ని బుధవారం నాడు ఆలయ కమిటీకి అందజేశారు.గత శుక్రవారం జాతర సందర్భంగా.ఈ విరాళాన్ని ప్రకటించిన ఎమ్మెల్యే,నేడు తన పిఏ చిన్నబాబు ద్వారా ఆ మొత్తాన్ని పంపించారు.స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మండల పార్టీ అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు ఆధ్వర్యంలో,ఎమ్మెల్యే పిఏ చిన్నబాబు ఈ నగదును కూటమి నాయకులు ఆలయ కమిటీ చైర్మన్ మలుగుల శ్రీనివాస్ రెడ్డికి అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా ఇరువురు నాయకులు మాట్లాడుతూ పలు కీలక విషయాలను పేర్కొన్నారు.గత తొమ్మిది నెలలుగా అమ్మవారి ఆలయం ముంపునకు గురికావడంతో,ఆలయానికి వచ్చే ఆదాయవనరులు పూర్తిగా నిలిచిపోయాయి.ఆలయ ఆర్థిక పరిస్థితిని,భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే శిరీష దేవి స్పందించి ఈ విరాళాన్ని ప్రకటించారు.ఎమ్మెల్యే చూపిన ఈ ఉదారతపై ఆలయ కమిటీ చైర్మన్ మరియు మండల కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ.హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు సొసైటీ అధ్యక్షులు మాగపు బాబురావు,మాజీ మండల అధ్యక్షులు ముండ్రు మధుసూదన్ రావు,మాజీ మండల అధ్యక్షులు మరి శేట్ల వెంకటేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి కీర్తి గంగరాజు, ప్రధాన కార్యదర్శి దొరబాబు, బిజెపి ప్రధాన కార్యదర్శి అయినల వెంకటేశ్వర్లు,సొసైటీ డైరెక్టర్ పల్లపాటి నాగేశ్వరరావు,సొసైటీ డైరెక్టర్ కాల సత్య రాజు అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి కారం పోచమ్మ,సీనియర్ నాయకులు రేలంగి రాంబాబు,బూత్ కన్వీనర్ డబ్బా నాని,మాజీ రాష్ట్ర యువత అధ్యక్షులు చవలం శివరామకృష్ణ,ఆలయ కమిటీ డైరెక్టర్లు పోతుల పెద్ద సత్యనారాయణ,కరణం సత్యనారాయణ,మాదాసు సుబ్రహ్మణ్యం,పెనుముచ్చి వెంకన్న,ఐ టీడీపీ ప్రధాన కార్యదర్శి కుటుంబ రెడ్డి,బూత్ కన్వీనర్ పుట్టపల్లి మల్లేష్,జనసేన నాయకులు కట్టుమూరి వీరబాబు,మీడియా కోఆర్డినేటర్ దుర్గ,పోతుల గాంధీ,అయినవిల్లి భద్రం ,ప్రచార కార్యదర్శి పేరు గని ఏసు,సోదే అరుణ,కూటమి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.