పయనించే సూర్యుడు మార్చ్ 26 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్. ఆదోనిలో కృత్రిమ కొరత సృష్టించి, గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న గ్యాస్ ఏజెన్సీ లపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ కి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, పట్టణ,మండల కార్యదర్శి వర్గ సభ్యులు తిప్పన్న, వీరారెడ్డి,పట్టణ నాయకులు వీరేష్ ప్రజలు ఎదుర్కొంటున్న గ్యాస్ కష్టాలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీరు మాట్లాడుతూ గృహ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకుని సుమారు 15 రోజుల నుండి 20 రోజులు అవుతున్నప్పటికీ ప్రజలకు గ్యాస్ సరఫరా చేయడం లేదని వారు తెలిపారు. దీంతో సింగల్ సిలిండర్ ఉన్న పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు గుర్తు చేశారు. వంట చెరుకు బయట దొరకడం లేదని వారు తెలిపారు. దీంతో గృహ వినియోగదారుల ఇండ్లలో ప్రజలు పస్తులుండే పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలియజేశారు. అదేవిధంగా ఇప్పటికే డొమెస్టిక్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉండటంతో కొన్ని హోటల్లో, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి ఉంది. దీని ఆసరాగా చేసుకొని కొన్ని గ్యాస్ ఏజెన్సీ వారు కృత్రిమ కురద సృష్టించి, సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వారు అన్నారు. గ్యాస్ కొరతతో పట్టణంలో కొన్ని చిన్న చిన్న హోటల్ యజమాన్యం నానా అవస్థలు పడుతున్నారని వారు తెలిపారు. కావున గ్రామీణ పట్టణ ప్రాంతాలలో గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఆందోళనలు చేయగలమని వారు తెలిపారు.