జడ్చర్లలో సిరిధాన్యాల”‘ మన చద్దన్నం'” టిఫిన్ సెంటర్‌ ప్రారంభం

* పెద్దలు మాట చద్ది మూట మన తాతముత్తాతలు సిరిధాన్యాలను తినడం వల్ల నిండు నూరేళ్లు బతికారు - మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి * ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్లు తినడం వల్ల అనారోగ్యం_ తెలంగాణ ఉద్యమ కవి  గాయకుడు కాశీ దాస్

పయనించే సూర్యుడు మార్చి 26, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: నేటి యాంత్రిక జీవనంలో అంతరించిపోతున్న పాతతరం రుచులను, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మళ్ళీ ప్రజలకు చేరువ చేసేందుకు జడ్చర్లలో అడుగులు పడ్డాయి. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ‘మన చద్దన్నం’ పేరుతో ఏర్పాటు చేసిన సిరిధాన్యాల టిఫిన్ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ చెర్నకోల లక్ష్మారెడ్డి  ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పెద్దల మాట చద్ది మూట” అనే సామెతను గుర్తు చేస్తూ, నేటి తరం ఆహారపు అలవాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. అతి చిన్న వయసులోనే పిల్లలు గుండెపోటు వంటి తీవ్ర అనారోగ్య స ప్రధాన కారణమని ఆయన మస్యలకు గురికావడానికి ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్లు అని పేర్కొన్నారు. మన తాతముత్తాతలు సిరిధాన్యాలను తినడం వల్ల నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించారని, అదే స్ఫూర్తితో ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, తెలంగాణ ఉద్యమ కవి  గాయకుడు కాశీ దాస్ మాట్లాడుతూ.. సమాజం ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో, లాభాపేక్ష కంటే సేవా దృక్పథం ముఖ్యం అని సిరిధాన్యాల కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాతతరం రుచులను ఆస్వాదించి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *