జిల్లా కమిటీలో బోధన్ నాయకులకు చోటు.

* నియామక పత్రం అందిస్తున్న ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 26 బోధన్ : కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో బోధన్ సీనియర్ నాయకులకు చోటు దక్కింది.జిల్లా ఉపాధ్యక్షులుగా పాషా మోహినిద్దీన్,ఆనంపల్లి ఎల్లయ్య, దొడ్ల రవీందర్ రెడ్డి కి ప్రధాన కార్యదర్శులుగా,జిల్లా అధికార ప్రతినిధిగా అల్లె రమేష్, కార్యదర్శిగా ఖాజాపూర్ అశోక్ లను నియమించారు.బుధవారం వారికి ప్రభుత్వ సలహాదారులు,బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డి నియమాత పత్రాన్ని అందించారు.పార్టీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ బలోపేతానికి నాయకులు,కార్యకర్తలను సమన్వయం చేస్తూ కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇందుకు సహాయ సహకారాలు అందించిన టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, బోధన్ నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా కమిటీలో స్థానం పొందిన పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *