డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాలెండర్ ఆవిష్కరణ – జగన్నాధపురంలో ఘనంగా కార్యక్రమం

పయనించే సూర్యుడు మార్చి 26, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). జగన్నాధపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నూతన క్యాలెండర్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాళ్లూరి స్వప్న ఆధ్వర్యంలో క్యాలెండర్‌ను విడుదల చేయగా, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే దిశగా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో మత్కేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బందెల నాగర్జున, వార్డు సభ్యులు గమ్మిడి శ్రీను, కాసిమాల శ్రావణ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరువురి వెంకటేశ్వర్లు, తన్నీరు పుల్లయ్య, తాళ్లూరి రమేష్, మండెపూడి కిషన్ రావు, తోటకూరి నరసింహారావు, సింగ్ కిషోర్, ఉపాధ్యక్షుడు ఎర్రమల ప్రసాద్, ముల్లంగి మురళి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెట్టెల కృష్ణ, మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే సైదా, అలవాల వెంకటేశ్వర్లు, చిర్రా నాగేశ్వరరావు, ఎరుకల వెంకటేష్, అలవాల నరసింహారావు, మూగబోతుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది.