తెలంగాణ రాష్ట్ర డిజిపి ని కలిసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

పయనించే సూర్యుడు మార్చ్ 26 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) జహీరాబాద్ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు ఈరోజు హైదరాబాద్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర డిజిపి బి.శివధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని పలు అంశాలపై వారు చర్చించారు. జహీరాబాద్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు వ్యవస్థ పనితీరు మరియు ప్రజల రక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ఎమ్మెల్యే డిజిపి వివరించారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పోలీస్ శాఖ నుంచి అందుతున్న సహకారం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజల సౌకర్యార్థం మరిన్ని మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ భేటీలో స్థానిక సమస్యలతో పాటు పోలీస్ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు సాగాయి.